Telangana

మహబూబాబాద్ లో వాహనాల వేలం.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మే16:సారాయి, బెల్లం సరఫరా చేస్తూ వివిధ కేసులలో పట్టుబడినటువంటి వాహనాలను వరంగల్ డిప్యూటీ కమిషనర్ జి. అంజన్ రావు మరియు మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి బి. కిరణ్ ఆదేశాల మేరకు తేది 19.05.2026 మంగళవారం నాడు ఉదయం 11:00 గంటలకు ఎక్సైజ్ స్టేషన్ మహబూబాబాద్ నందు బహిరంగ వేలం పాట ఆధ్వర్యంలో నిర్వహించబడుననీ ఎక్స్చేంజ్ సిఐ చిరంజీవి తెలిపారు.ఇట్టి వేలంపాటలో పాల్గొనదలచిన వారికి సూచనలు:
1. ఇట్టి వేలంపాటలో పాల్గొనదలచిన వారు అట్టి వాహన ధర (అప్సెట్ ప్రైస్) లో 50% డిపాజిట్ చేయాలి.
2. ఇట్టి వాహనాల వివరాలు ఎక్సైజ్ స్టేషన్ మహబూబాబాద్ నందు కలవు, ఇట్టి వేలంపాటలో పాల్గొనదలచిన వారు ముందుగా వాహనాలను చూసుకుని వేలం పాటలో పాల్గొనగలరు.
3. వేలంపాటలో పాల్గొని వేలంలో వాహనం వచ్చిన తర్వాత అట్టి వాహనం తీసుకోని యెడల అతని యొక్క డిపాజిట్ (జప్తు )చేయడం జరుగుతుంది.
4. ఒకవేళ వేలంపాటలో పాల్గొని వాహనం రాకుంటే వారి డిపాజిట్ వారికి తిరిగి ఇవ్వబడును.
5. దరఖాస్తు తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ కూడా సమర్పించవలెను.
6. వేలం పాటలో వాహనం తీసుకున్నవారు అదే రోజు మొత్తం అమౌంట్ మరియు GST తో కలిపి చెల్లించాలనీ పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button