Ananthapuram
సోషల్ మీడియాలో లేనిపోని అవాస్తవాలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. డీఎస్పీ వార్నింగ్

కళ్యాణదుర్గం : సోషల్ మీడియాలో లేనిపోని అవాస్తవాలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు హెచ్చరించారు. శనివారం కళ్యాణదుర్గంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సరైన ఆధారాలు లేకుండా తప్పు వార్తలు, వదంతులు వ్యాపింపజేయడం చట్ట విరుద్ధం అన్నారు. వాట్సాప్ గ్రూపు అడ్మిన్లు కూడా చట్టప్రకారం శిక్షార్హం అవుతారని తెలిపారు. తగిన జాగ్రత్తలు వహించాలని విజ్ఞప్తి చేశారు.


