రేణిగుంట విమానాశ్రయం కు చేరుకున్న…. మంత్రి నారా లోకేష్

తిరుపతి జిల్లా, రేణిగుంట : నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం నేడు గురువారం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు ఆర్టిజీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు కి జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, చంద్రగిరి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, గూడూరు ఎమ్మెల్యే లు పులివర్తి నాని, నెలవెల విజయశ్రీ, బొజ్జల సుధీర్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, ఎం ఎల్ సి బల్లి కళ్యాణ చక్రవర్తి, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేట్లు, నరసింహచారి నరేంద్ర, శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్, తదితర అధికారులు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.



