అంగరంగ వైభోవంగా శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

కడప జిల్లా, ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో 26 వ తేది నుండి 05 వ తేది వరకు శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోవంగా జరుగును. బ్రహ్మోత్సవాలులో నేడు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
28 వ తేది శనివారం వేణు గానలంకరం, ఉత్సవముర్థులకు ఉంజల్ సేవా మరియు హంసవాహనం, 29 వ తేది ఆదివారం వాటపత్రశాయు అలంకారం, ఉంజల్ సేవా మరియు సింహావాహనం,30 వ తేది సోమవారం నవనీత కృష్ణాలంకారం, ఉంజల్ సేవా మరియు హనుమత్సన, 31 వ తేది మంగళవారం మోహిని అలంకారం, ఉంజల్ సేవా మరియు గరుడ సేవా, 01 వ తేది బుధవారం సాయంత్రం 6:30 నుండి రాత్రి 09:00 వరకు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగును. స్వామి వారి కల్యాణనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు మరియు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే లు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. 02 వ తేది గురువారం రధోత్సవం, 03 వ తేది శుక్రవారం కాశియమార్థణాల అలంకారం మరియు అశ్వావాహనం, 04 వ తేది శనివారం చక్రాస్నానం మరియు మహా పూర్ణ హృతి ద్వాజరోహనం, 05 వ తేది ఆదివారం శ్రీ పుష్ప యాగం మరియు ఏకాంత సేవా కార్యక్రమలు జరుగును.
ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి శ్రీరాముని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి దర్శనం అనంతరం తీర్తప్రసాదలు స్వీకరించారు.
అనంతరం భక్తులు అన్నప్రసదం స్వీకరించారు.
టీటీడీ ఆధ్వర్యంలో భక్తుల కోసం పార్క్ లు మరియు విశ్రాంతి కొరకు చలువ పందెళ్ళు,సామియానాలు ఏర్పాటు చేసేరు.టీటీడీ దేవస్థాన ఆధ్వర్యంలో భక్త బృందలు నాట్య నృత్యం , చక్కభజనలు, కోలాటలు ఏర్పాట్లు చేసేరు.01 వ తేది న జరగబోయే స్వామి వారి కళ్యాణంకు పూర్తి ఏర్పాట్లు చేసేరు.
దేవస్థానం చుట్టూ మరియు కల్యాణ మండపం దగ్గర హంగులతో విద్యుత్ దీపాలు తొ అలంకరణ చూసి
భక్తులు మైమరచిపోయారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీమతి ఎ. ప్రశాంతి, ఎ. శివప్రసాద్, జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్, జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ యస్. భావన, ఒంటిమిట్ట సీఐ నరసింహ రాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



