Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Andhra Pradesh

క్రికెట్ ఆనందాన్ని ఇస్తుంది,,బెట్టింగ్ అప్పులు పాలు చేస్తుంది

మదనపల్లి జిల్లా : మదనపల్లి సూపర్ డెంట్ అఫ్ పోలీస్ కార్యాలయం లో జిల్లా ఏస్పీ ధీరాజ్ కునుబిల్లి ఐపీస్, మీడియా తో మాట్లాడుతు…. మార్చి 28 వ తేది నుండి మే నెల 31 వ వరకు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న సందర్భంగా, మదనపల్లి జిల్లా ప్రజలను హెచ్చరిస్తు నేడు ఒక కీలక సందేశాన్ని విడుదల చేశారు. యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా, క్రికెట్‌ను కేవలం క్రీడలాగే చూడాలన్నారు.
“ఆశకు పోయి జీవితాన్ని పాడుచేసుకోవద్దు…. “తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని బుకీలు చెప్పే మాటలు నమ్మకండి. బెట్టింగ్ అనేది ఒక విషవలయం. ఒక్కసారి అందులో పడితే అప్పుల ఊబిలో కూరుకుపోయి, కుటుంబం రోడ్డున పడి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉందన్నారు.
“బుకీలకు చెక్….అమాయక విద్యార్థులను, యువతను ఆకర్షించే బుకీల ఆటలు సాగనివ్వమని, అక్రమాలకు పాల్పడితే కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పరుస్తామని స్పష్టం చేశారు.
“ఆన్‌లైన్ జూదగాళ్లపై నిఘా….. స్మార్ట్‌ఫోన్లలో సీక్రెట్ యాప్స్, టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపులు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా బెట్టింగ్ నిర్వహించే ముఠాలపై స్పెషల్ బ్రాంచ్, సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టమని, ప్రతి పైసా లావాదేవీని పోలీసులు పర్యవేక్షిస్తున్నమన్నారు.
ఎవరైనా పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటమన్నారు. “విద్యార్థులు, యువత జాగ్రత్త….. సరదాగా మొదలయ్యే ఈ అలవాటు మీ కెరీర్‌ను దెబ్బతీస్తుందని, పోలీస్ కేసు నమోదైతే ఉద్యోగాలు, పాస్‌పోర్ట్ రావడం కష్టమవుతుందని, యువత తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
“తల్లిదండ్రులకు విజ్ఞప్తి…..మీ పిల్లలు మొబైల్ ఫోన్లలో ఎక్కువగా ఏం చూస్తున్నారు….?? వారి ప్రవర్తనలో ఏవైనా మార్పులు వచ్చాయా….?? అనేది గమనించలని, వారి బ్యాంక్ ఖాతాల నుంచి అనుమానాస్పదంగా డబ్బులు కట్ అవుతుంటే వెంటనే అప్రమత్తం కావాలన్నారు. “సహకరించండి…..మీ ప్రాంతంలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100/112 కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button