బెట్టింగ్ ఉబిలో పడొద్దు – జీవితాన్ని అంధకారంలోకి నెట్టొద్దు….. జిల్లా ఏస్పీ

నెల్లూరు జిల్లా : నెల్లూరు ప్రధాన పోలీస్ కార్యాలయం లో నేడు ఆదివారం జిల్లా ఏస్పీ డా. అజిత వేజెండ్ల మీడియా తొ మాట్లాడుతు…. యువత బెట్టింగ్ లకు బానిస అయితే జీవితం అంధకారమేనన్నారు.
ఈ నెల 3 వతేదిన వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో 1 కోటి 65 లక్షల అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ చేధించి 89 లక్షలు ఆన్ లైన్ సీజర్ తో పాటు 35 లక్షలు రికవరీ, ముగ్గురు బెట్టింగ్ రాయుళ్ళు అరెస్ట్ చేసేమని,గతంలో క్రికెట్ బెట్టింగ్ లో ఇన్వొల్వయన బెట్టింగ్ రాయుళ్ళు కు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.
28 వ తేది నుండి మే నెల 31 వ తేది దాకా, ఐపీల్ సీజన్ మొదలైన సందర్బంగా నెల్లూరు జిల్లా పరిధిలో ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ గురించి యువతకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్నమన్నారు. బెట్టింగ్‌కు బానిసలై కొంత మంది యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ఆందోళన వ్యక్తం చేశారు. క్రికెట్ కేవలం వినోదం కోసం చూడాలి అని బెట్టింగ్ వైపు మొగ్గు చూపితే అది ఉబి లాంటిది అని ఇంకా వెనక్కి రావడం కష్టం అన్నారు. ప్రత్యేకంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువకులు ఈ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొని ఆర్థిక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
బెట్టింగ్ అనేది కేవలం ఆర్థిక నష్టము మాత్రమే కాకుండా కుటుంబం మొత్తాన్ని ప్రభావిత పరుస్తూ ఆశాంతి గురి చేస్తుందని, వ్యక్తుల ఆర్థిక స్థితిని దెబ్బతీయడమే కాకుండా కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అప్పులపాలు అయ్యే పరిస్థితులు ఏర్పడి జీవితాలను నాశనం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలు సమాజంలో చెడు ప్రభావాలను కలిగిస్తాయని తెలిపారు.
ప్రభుత్వం బెట్టింగ్ మరియు బెట్టింగ్ రిలేటెడ్ గేమింగ్ యాప్ లు నిషేధం చేసినప్పటికి, పోలీసులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, కొంతమంది సోషల్ మీడియా వేదికలు అయిన టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అక్రమ బెట్టింగ్ కొనసాగిస్తున్నారని గుర్తించారు.
బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే, ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీస్ శాఖ నిఘా మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.బెట్టింగ్ పూర్తిగా చట్టవిరుద్ధమని, ఇందులో పాల్గొనేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్ నిర్వహణ, ప్రోత్సాహం, పాల్గొనడం—ఇవి నేరాలుగా పరిగణించబడతాయని స్పష్టం చేశారు. ప్రజలు అనుమానాస్పద బెట్టింగ్ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని,యువత సోషల్ మీడియా మరియు ఆన్లైన్ గేమింగ్ యాప్‌ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించి, వారి ఆన్లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించాలన్నారు.
జిల్లాలో బెట్టింగ్ భూతంను అంతం చేయాలంటే
ప్రజలు, సహకారం అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బెట్టింగ్ గురించి
ఏదయినా సమాచారం ఉంటే కాల్ 112 మరియు పోలీస్ కంట్రోల్ రూమ్: +919392903413
సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.



