అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్…. జిల్లా ఏస్పీ

అనంతపురం జిల్లా : అనంతపురం సూపర్ డెంట్ అఫ్ పోలీస్ కార్యాలయం లో నేడు మంగళవారం జిల్లా ఏస్పీ జగదీష్ ఐపీస్, పత్రిక సమావేశం లో మాట్లాడుతు…. కల్యాణదుర్గం పట్టణం, సిద్ధాపవంక వీధి లో ఒక ఇంటిలో గత రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీ చేయగా, తలారి మధుతో పాటు ఇంకా 9 మంది సభ్యులు ముఠా గా ఏర్పడి, బెట్టింగ్ లు ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు.పిలిప్పీన్స్ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న గ్యాంగ్,గ్యాంగ్ లో పది మందిని అరెస్ట్ చేసేమని,ఇద్దరు పరారీ లో ఉన్నారన్నారు.
నిందితుల్లో కళ్యాణదుర్గం తో పాటు ఏపీ, కర్ణాటక, తెలంగాణకు చెందిన వారు ఉన్నరన్నారు.
పిలిప్పీన్స్ కు చెందిన శివ కింగ్ పిన్,పిలిప్పీన్స్ కేంద్రంగా అంతర్జాతీయ నిషేధిత ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న శివ, దేశవ్యాప్తంగా టీం లను ఏర్పాటు చేసేరాన్నారు.
పిలిప్పీన్స్ లోని మాకాటి మెట్రో మనిలా కేంద్రంగా నిషేధిత డ్రీం ప్లే 1 యాప్ ద్వారా గేమింగ్ మరియు
కింగ్ పిన్ కు 60శాతం, దేశీయంగా సహకరించిన సభ్యులకు 40 శాతం వాటాలు ఉన్నాయన్నారు.
బెట్టింగ్ వాళ్ళ దగ్గర నుండి
19లక్షల 70వేల నగదు, కారు, 4 బైకులు, 3 ల్యాప్ ట్యాప్ లు,15 సిమ్ కార్డులు, 04 చెక్ బుక్కులు, 13
ఎటిఎం కార్డులు, 01 ట్యాబ్, 15 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని, 9 బ్యాంకుల్లో 49 మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాలలోని 18 లక్షల రూపాయలను సిజ్ చేసేమన్నారు.



