కడప జిల్లా పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన…. జిల్లా ఏస్పీ

కడప జిల్లా: కడప జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ సెల్క్ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, నేడు బుధవారం కడప వన్ టౌన్ , టూ టౌన్, తాలూకా, సైబర్ క్రైమ్, చింతకొమ్మ దీన్నే, పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసేరు.
సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన పిటిషనర్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను పరిశీలించి చట్ట పరిధిలో నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని సంబంధిత సిఐ లను ఆదేశించారు. గురువారం 28 న బక్రీద్ పండుగ సందర్బంగా కడప వన్ టౌన్ , టూ టౌన్, తాలూకా, సి.కె దిన్నె పోలీస్ స్టేషన్ల పరిధిలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బక్రీద్ నేపథ్యంలో సోషల్ మీడియా పై నిఘా ఉంచాలని, సైబర్ క్రైమ్ సిఐ మధుమల్లేశ్వర రెడ్డి ని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో…. కడప వన్ టౌన్ సిఐ, వి.చిన్న పెద్దయ్య, కడప టూ టౌన్ సిఐ, శ్రీహరి, కడప తాలూకా సిఐ,నరసింహ రాజు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మధుమల్లేశ్వర రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



