ట్రాఫిక్ పోలీస్ లకు రోడ్ భద్రత కిట్ లను అందజేసిన…. జిల్లా ఏస్పీ,, జిల్లా కలెక్టర్.

తిరుపతి జిల్లా: తిరుపతి సూపర్ డెంట్ అఫ్ పోలీస్ కార్యాలయం లో నేడు బుధవారం జిల్లా కలెక్టర్ యస్. వెంకటేశ్వర్ మరియు జిల్లా ఏస్పీ యల్. సుబ్బారాయుడు లు పాల్గొని హైవే మొబైల్ మరియు ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి రోడ్డు భద్రతా కిట్లను పంపిణీ చేసేరు.జిల్లా ఏస్పీ యల్. సుబ్బారాయుడు మాట్లాడుతు….. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ( డి జి పి ) హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో గత మూడు నెలలు నుండి తీవ్రంగా ఎండలు ఉండడం తో ట్రాఫిక్ పోలీస్ ల ఆరోగ్యం రక్షణ కోసం “ఏపీ డిజిపి ” 48 లక్షల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించారు.
ఈ నిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,192 మంది ట్రాపిక్ పోలీస్ సిబ్బందికి యువి గాగుల్స్, వైట్ క్యాప్స్, ఓ ఆర్ యస్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, మాస్కులు ని అందించారు.ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఏపీ డిజిపి కి హార్షం తెలిపారు.



