24 వ తేది, తెలుగుదేశం పార్టీ సైకిల్ ఎక్కుతున్న “కొల్లం” కుటుంబ సభ్యులు.

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం,వత్తలూరు పంచాయతీ,మల్లేవారిపల్లి గ్రామవాసి కొల్లం మోహన్ రెడ్డి నేడు శనివారం మీడియా కు పత్రిక ప్రకటన లో మాట్లాడుతు….. మా కొల్లం కుటుంబం గత కొన్ని సంవత్సరాల నుండి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నమ్మిన కుటుంబముగా నియోజకవర్గంలో విరాజిల్లిన కొల్లం కుటుంబమని, కాని ఇప్పుడు కుటుంబ కలహాలతో సతమతమై ఒక వర్గం,డిసిసిబి మాజీ చైర్మన్ రైల్వే కోడూరు నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ దివంగత కొల్లం బ్రహ్మానందరెడ్డి మరియు కొల్లం గంగిరెడ్డి సొంత చిన్నాన్న కుమారులైన కొల్లం రజనీకాంత్ రెడ్డి, కొల్లం మోహన్ రెడ్డి పుల్లంపేట మండలం లోని వత్తలూరు పంచాయతీ మల్లెం వారి పల్లె గ్రామంలో ఘనంగా విందు ఏర్పాటు చేసి, రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇన్చార్జి ముక్కా రూపానంద రెడ్డి సమక్షంలో ఈనెల 24 వ తేది తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని, టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకునే దానికి సిద్ధం అవుతున్న మన్నారు.



