జిల్లాలో 21 న జరిగే నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రత… జిల్లా ఏస్పీ

కడప జిల్లా: కడప సూపర్ డెంట్ అఫ్ పోలీస్ కార్యాలయం లో నేడు సోమవారం జిల్లా ఏస్పీ సెల్కె నచికేత్ విశనాధ్ ఐపీస్, మీడియా తొ మాట్లాడుతు…. జిల్లాలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( యన్ టి ఏ ) న్యూఢిల్లీ వారు ఈనెల 21వ తేదీన నిర్వహించే (నేషనల్ ఎలిజిబులిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ నిట్ )ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ (యుజి) పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, పారదర్శకంగా పరీక్ష ప్రక్రియ జరిగేలా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుందని నిర్వాహకులకు తెలిపారు. జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడుతుందని, ఇందులో కడప నగరంలో 8, ప్రొద్దుటూరు పట్టణంలో 2, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షకు 3,164 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు.
అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అత్యాధునిక డ్రోన్ కెమేరాలు వినియోగిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో…. ప్రొద్దుటూరు ఎఎస్పీ విబు కృష్ణ ఐ.పి.ఎస్, ఎ.ఆర్ అడిషనల్ ఎస్పీ బి. రమణయ్య , స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్, కడప ఇంచార్జ్ డి.ఎస్.పి ఇ.బాలస్వామి రెడ్డి, కడప నగరం, ప్రొద్దుటూరు పట్టణాల్లోని పోలీస్ అధికారులు, పోస్టల్, బ్యాంకింగ్, సి.ఆర్.పి.ఎఫ్, నీట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



