పోలీస్ “సీఐ” కార్యాలయన్ని ప్రారంభోత్సవం చేసిన….. జిల్లా ఏస్పీ

తిరుపతి జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం, టౌన్ లో నేడు బుధవారం రైల్వే కోడూరు నియోజకవర్గ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయన్ని జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ ( ఏస్పీ) యల్. సుబ్బారాయుడు ఐపీస్, ప్రారంభోత్సవం చేసేరు.
అనంతరం రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.శ్రీనివాసులు జిల్లా ఎస్పీకి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికేరు.అనంతరం నూతన సీఐ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఏస్పీ చెట్లను నాటేరు.
జిల్లా ఏస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్, మాట్లాడుతు…. పుల్లంపేట మండలం లో ఎక్కువగా ఎర్రచందనం, గంజాయి, క్రికెట్ బెట్టింగ్ లు, డ్రగ్స్, కోడిపందెలు, పేకాట జూదం,చైన్ స్కాచర్, రౌడీయుజం లపై మా పోలీసులు నిఘా పెట్టెమని, పుల్లంపేట మండలం లో రాజకీయం గా ఎలాంటి అల్లర్లు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళు అయిన క్షమించమని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయాన్నారు.
ఆలాగే ప్రజలు ప్రతి ఒక్కరు టు వీలర్ మరియు పోర్ వీలర్ వాహనాలకు ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఆర్ సి, తప్పక ఉండాలని, ఆలాగే బైక్ లో వెళ్లే యువత హెల్మిట్ తప్పనిసరిగా ఉండాలని అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని వాహనాలు నడిపేటప్పుడు నిదానంగా వెళ్లాలని, మిమ్మల్ని నమ్ముకొని మి కుటుంబం ఆధారపడి ఉందని గమనించు కోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో….. అదనపు ఎస్పీలు, ఆర్ల శ్రీనివాసులు, రవి మనోహరాచారి, రేణిగుంట డిఎస్పీ శ్రీనివాసరావు,రైల్వే కోడూరు పట్టణ సీఐ చంద్రశేఖర్, ఎస్సై ప్రసాద్ రెడ్డి,పుల్లంపేట యస్ ఐ చిన్న రెడ్డెప్ప, ఓబుళవారిపల్లి ఎస్సై సుజన్ కుమార్, చిట్వేల్ ఎస్సై వినోద్ కుమార్, పెనగలూరు ఎస్సై అరుణ్ కుమార్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.



