Andhra Pradesh

అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న టాస్క్ పోర్స్…. జిల్లా ఏస్పీ

తిరుపతి జిల్లా: తిరుపతి అటవీశాఖ కార్యాలయంలో నేడు గురువారం జిల్లా ఎర్రచందనం టాస్క్ పోర్స్ మరియు ఆర్ యస్ ఏ యస్ టి యఫ్ మరియు జిల్లా ఏస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్, మీడియా సమావేశం లో మాట్లాడుతు….. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా లోని శేషాచలం రిజర్వ్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం ( ఆర్ యస్ ఏ యస్ టి యఫ్ ) హెడ్ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. ఆధ్వర్యంలో ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ ఎస్పీ పి. శ్రీనివాస్, ఐపీఎస్, అదనపు ఎస్పీ జె. కులశేఖర్, ప్రత్యేక ఆపరేషన్లు నిరంతరం నిర్వహించబడిన తరుణం లో ఎర్రచందనం కేసుల్లో నిందితులుగా ఉండి పరారీలో తిరుగుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్లను గుర్తించి చట్టం ముందు నిలబెట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృత చర్యలు చేపట్టమన్నారు.
ఈ క్రమంలో నిన్న మంగళవారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు అటవీ శాఖ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారంతో అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో అనంతపురం జిల్లాకు చెందిన నల్లాని నందకుమార్ (32), నల్లాని జయరామయ్య, బొట్టు రాఘవేంద్రలను అదుపులోకి తీసుకున్నమన్నారు.
దర్యాప్తులో భాగంగా, పై నిందితులు ఒక ముఠాగా ఏర్పడి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను అక్రమంగా నరికించి, వాటిని దుంగలుగా తయారు చేయించి, అధిక ధరలకు ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రధాన స్మగ్లర్లకు విక్రయించేందుకు ప్రణాళిక రచించినట్లు వెల్లడైందని,ఈ క్రమంలో నార్పల మండలం పరిధిలోని బొందలవాడ నుండి బొమ్మలాటపల్లి గ్రామానికి వెళ్లే మట్టి రహదారి సమీపంలో జయరామయ్యకు చెందిన పొలంలోని రేకుల షెడ్ పక్కన ఎర్రచందనం దుంగలను డంప్ చేసి దాచిపెట్టినట్లు గుర్తించమన్నారు.
అలాగే టాస్క్ ఫోర్స్ బృందం నిర్వహించిన దాడిలో మొత్తం 109 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అక్రమ రవాణాకు వినియోగించిన ఒక కారును కూడా సీజ్ చేశమని, స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు మరియు వాహనం కలిపి సుమారు రూ.2 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారన్నారు.
ఈ కేసులో భాగమైన ఇతర ప్రధాన సూత్రధారులు, అంతర్రాష్ట్ర స్మగ్లర్లను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోందని, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన కొనుగోలుదారులు మరియు స్మగ్లింగ్ నెట్వర్క్కు సంబంధించిన వ్యక్తులపై కూడా విచారణ చేపట్టబడుతున్నమన్నారు.
ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించి భారీ మొత్తంలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించమన్నారు.
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ నరికివేత, నిల్వ, రవాణా మరియు స్మగ్లింగ్ కార్యకలాపాలపై భవిష్యత్తులో కూడా మరింత కఠిన చర్యలు కొనసాగుతాయని, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు నిర్దాక్షిణ్యంగా అమలు చేయబడతాయని అధికారులు స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button