మృతి చెందిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు…. జిల్లా ఏస్పీ

కడప జిల్లా : కడప జిల్లాలో ఇటీవల కాలంలో అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాలలో మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ముగ్గురికి నేడు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ లుగా నియమిస్తూ కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్, జిల్లా పోలీస్ కార్యాలయంలో అందచేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ మాట్లాడుతు…. పోలీస్ శాఖలో విధులు నిర్వహించే సిబ్బంది ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తుంటారని, అటువంటి సిబ్బంది అకాల మరణం కుటుంబాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తుందన్నారు. మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక సమస్యలను, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబంలోని అర్హత కలిగిన వ్యక్తులలో ఒకరికి ప్రభుత్వం కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తూ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందచేయడం జరిగిందన్నారు. ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో మరణించిన చెందిన 1) డి.మల్లిఖార్జున , ఏ.ఆర్.ఎస్.ఐ కుమార్తె డి.మల్లిక, వేరు వేరు రోడ్డు ప్రమాదాలలో మరణించిన 2) ఎస్.సతీష్ కుమార్ రాజు, సివిల్ కానిస్టేబుల్ సతీమణి అఖిలభారతికి 3) బి.ముకుందర, సివిల్ కానిస్టేబుల్ సతీమణి పి.భారతి కి జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ లు గా నూతనంగా ఉద్యోగం మంజూరు చేయగా నియామక ఉత్తర్వులు అందజేసి వారిని అభినందించారు. విధుల్లో తక్షణమే జాయిన్ అవ్వాలని, విధుల గురించి తెలుసుకోవాలని, తమకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. అలాగే కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డి.పి.ఓ ఏ.ఓ జి.సుజాత, సూపరింటెండెంట్ శ్రీనివాస నాయక్ పాల్గొన్నారు.



