Andhra Pradesh
ప్రజల సమస్యలు త్వరగా తీరుస్తాం…. జిల్లా ఏస్పీ

నెల్లూరు జిల్లా: నెల్లూరు ప్రధాన పోలీస్ కార్యాలయం లొ నేడు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీర్స్ )లో జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, ఐపీస్, ప్రజల నుంచి 136 ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి పిటిషన్ను బాధ్యతాయుతంగా, త్వరితగతిన విచారించి ప్రజలకు చట్టపరమైన న్యాయం అందించడమే జిల్లా పోలీసు శాఖ లక్ష్యమన్నారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా పోలీసు శాఖను నమ్మకంతో సంప్రదించాలని, ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అలాగే నెల్లూరు జిల్లా నలుమూలల వచ్చిన పిర్యాదారులకు భోజన సౌకర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో… ఏ ఏస్పీ, డి ఏస్పీ లు మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.



