గుర్రంకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించిన…. జిల్లా ఎస్పీ,, జిల్లా కలెక్టర్.

మదనపల్లి జిల్లా: గుర్రంకొండ మండలం లో జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ ( ఏస్పీ ) ధీరాజ్ కునుబిల్లి ఐపీస్ మరియు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ లు నేడు గురువారం సంయుక్తంగా గుర్రంకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు బాధితులతో నేరుగా మాట్లాడి పోలీసు సేవలపై ఆరా తీశారు.
అలాగే మహిళలు, చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోక్సో, బాల్య వివాహాల నివారణ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచి,బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మహిళా పోలీసులు (జిమ్మెస్క్) ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, బాధితుల సమస్యలను వేగంగా పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
గ్రామాలు, విద్యాసంస్థల్లో పర్యటిస్తూ మహిళా చట్టాలు, రక్షణ మార్గాలపై ప్రజలకు, విద్యార్థినులకు నిరంతరం అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
కాలేజ్ మరియు పాఠశాల ల వద్ద అల్లరిముకలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే యువత గంజాయి, డ్రగ్స్ లకు బానిసలుగా కానివ్వకుండా యువత పై నిఘా ఉంచాలన్నారు.
అనంతరం టు వీలర్ మరియు పోర్ వీలర్ లను తనిఖీ చేసి, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి, పొల్యూషన్, ఇన్సూరెన్స్, హెల్మెట్ లు తప్పనిసరిగా ఉండేటట్లు చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో… పోలీస్ మరియు రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.



