Andhra Pradesh
బంక్ ల వద్ద సిబ్బందిని నియమయించి డీజిల్ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి

ఏలూరు, ఏప్రిల్, 28 : బంక్ ల వద్ద డీజిల్ పక్కదారి పట్టకుండా సిబ్బందిని నియమించి డీజిల్ సక్రమంగా సరఫరా అయ్యేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. డీజిల్ కొరతపై మంగళవారం అధికారులు, తహశీల్దార్లతో కలెక్టర్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వివిధ ఆయిల్ కంపెనీల నుండి ట్యాంకర్లు మంగళవారం మధ్యాహ్నానికి ఇండెంట్ పెట్టిన బంక్ లకు చేరుకుంటున్నాయని, బంక్ ల నుండి డీజిల్ సక్రమంగా సరఫరా జరిగేలా ప్రతీ బంక్ దగ్గర సిబ్బందిని నియమించి పర్యవేక్షించాలన్నారు.



