గ్రామాల్లో ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా చూడాలి:మంత్రి.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మే 13:గ్రామాల్లో త్రాగునీరు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, అధ్యక్షతన జిల్లా స్థాయి అభివృద్ధి పనుల సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ధనసరి అనసూయ సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు, మహబూబాబాద్ ఎం.పి పోరిక బలరాం నాయక్, డాక్టర్ భూక్య మురళి నాయక్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వేసవి తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో అత్యంత అధిక ప్రాధాన్యతగా త్రాగునీటి సమస్య రాకుండా క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్ గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ జిల్లా యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగాలని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినందున పద్దుల వారీగా ఖర్చులు చేసి అభివృద్ధికి కృషి చేయాలని, ప్రస్తుతం ధాన్యం మొక్కజొన్న ల కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలని, ఐకెపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల వ్యవస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి దిశగా పయనిస్తుందని నిత్యం గ్రామాలు పట్టణాల పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు,
కొంతమంది అభివృద్ధి పనులపై దుష్ప్రచారం చేస్తున్నారని అట్టివారిని సహించేది లేదన్నారు, రానున్న వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని నూతన లైన్లు ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, జిల్లా ఫారెస్ట్ అధికారి విశాల్ బత్తుల, అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మహబూబాబాద్ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు జ్యోతి, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవ రెడ్డి, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జడ్పీ సీఈవో పురుషోత్తం, అన్ని విభాగాల జిల్లా అధికారులు, డోర్నకల్, మరిపెడ తొర్రూరు, కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్లు , వైస్ చైర్మన్లు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



