గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన…. పోలీస్ అధికారులు

మదనపల్లి జిల్లా: రాయచోటి డి ఏస్పీ కార్యాలయం లో నేడు బుధవారం జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ ( ఏస్పీ) ధీరాజ్ కునుబిల్లి ఐపీస్, మీడియా సమావేశం లో మాట్లాడుతు…. రాయచోటి నియోజకవర్గం, రామాపురం పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన నిందితులు1) బోడన్న (వైజాగ్) 2) ఖాదర్ బాషా (రాయచోటి), 3) పరిమల ప్రకాష్ (బీహార్)లను గువ్వలచెరువు ఘాట్ వద్ద అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న 4 కిలోల గంజాయి, 1 బైకు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నమన్నారు.
ఈ గంజాయి స్మగ్లర్లు విశాఖపట్నం లో గంజాయి కొని బెంగళూరులో ‘పోర్టర్ యాప్’ ద్వారా అక్రమంగా విక్రయిస్తున్నరన్నారు.
గంజాయి, మాదకద్రవ్యాల సమాచారం ఉంటే ప్రజలు వెంటనే డయల్ 100/112 లేదా టోల్ ఫ్రీ 1972 కు కాల్ చేసి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ గంజాయి కేషు ను ఛేదించిన రాయచోటి డీఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్, రామాపురం ఎస్ఐ కె.బి. శివ కుమార్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో… పోలీస్ అధికారులు పాల్గొన్నారు.



