Andhra Pradesh

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ను ఆఖస్మిక తనిఖీ చేసిన…. జిల్లా ఏస్పీ

తిరుపతి జిల్లా : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, గాజులమని మండల పోలీస్ స్టేషన్ ని బుధవారం అర్ధరాత్రి ,డ్యూటీ సిబ్బంది పనితీరుపై ఆకస్మికంగా తనిఖీ చేసేరు.
ఈ సందర్భంగా స్టేషన్లో విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరును సమీక్షిస్తూ, డ్యూటీ నిర్వహణలో అప్రమత్తత, సమయపాలన పాటించాలని సూచించారు. నైట్ బీట్ సిస్టమ్తో పాటు హైవే మొబైల్స్ పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
హైవే ప్రాంతాల్లో నిరంతరం పహారా నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై కఠిన నిఘా ఉంచాలని తెలిపారు. అలాగే అత్యవసర సేవలలో భాగమైన డైలీ 112 కాల్స్పై తక్షణ స్పందన ఇవ్వాలని, ప్రతి కాల్ను సమర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు.రోడ్డు భద్రత దృష్ట్యా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అదేవిధంగా, అర్ధరాత్రి సమయంలో జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు “స్టాప్ అండ్ వాష్” కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. దీని ప్రకారం, రాత్రి వేళల్లో హైవే మీద ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి, డ్రైవర్లకు అలసట తగ్గించేలా ముఖం కడుక్కోవడానికి అవకాశం కల్పించడం, కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేలా ప్రోత్సహించడం ద్వారా అప్రమత్తంగా ప్రయాణం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే హైవేలకు అనుబంధంగా ఉన్న అవుట్కట్స్ ప్రాంతాల్లో సంబంధిత పోలీస్ అధికారులతో కలిసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు నిరంతర పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేసిన ఎస్పీ గారు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యతగా ఉండాలని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button