ఉప రాష్ట్రపతి, తిరుమల పర్యటన సందర్బంగా పక్కడ్బెందిగా బందోబస్తు….. జిల్లా ఏస్పీ

తిరుపతి జిల్లా : తిరుపతి ఏస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్, నేడు శనివారం రేణిగుంట ఎయిర్పోర్ట్ “ఏ యస్ ఎల్ ” అడ్వాన్స్ సెక్యూరిటీ లిషన్ ” సమావేశం లో మాట్లాడుతు….. తిరుపతి జిల్లాకు భారత ఉపరాష్ట్రపతి సీపీ. రాధాకృష్ణన్ 27 మరియు 28 తేదీలలో తిరుపతి–తిరుమల పర్యటన నేపథ్యంలో భద్రత మరియు పరిపాలనా ఏర్పాట్లపై అధికారులు ముందస్తు సమీక్ష నిర్వహించారు.జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) జి. నరసింహులు, ఉపరాష్ట్రపతి కార్యాలయ అధికారులు మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, రూట్ మ్యాప్, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లు, అత్యవసర సేవలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి పర్యటన విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఎయిర్పోర్ట్ నుండి తిరుచానూరు, తిరుమల వరకు ఏఎస్ఎల్ నిర్వహించి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.పోలీసులు ప్రతి అంశాన్ని సమగ్రంగా సమీక్షించి, ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.



