ఘనంగా శ్రీ బలిజపల్లి గంగమ్మ తల్లి జాతర

కడప జిల్లా : రాజంపేట పట్టణ పరిధిలో ఉన్న బలిజపల్లి శ్రీ గంగమ్మ తల్లి జాతర నేడు గురువారం అంగరంగ వైభవంగా జరిగింది.కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పేరుందిన బలిజ పల్లె గంగమ్మను భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కడప జిల్లా రాజంపేట మండలం బలిజపల్లి లో వెలసిన గంగంమ్మ ఆలయానికి ఓ విశిష్ట చరిత్ర ఉంది. ఇక్కడ గంగమ్మ తల్లి స్వయంభుగా వెలసిందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ గ్రామంలో గంగమ్మ జాతరకు దాదాపు 200 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏటా ఒకసారి నిర్వహించే ఈ జాతరకు రాజంపేట ప్రాంతంలోనే కాక రాయలసీమ నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. స్థానికులే కాకుండా వివిధ దేశాల్లో స్థిరపడినటువంటి వారు కూడా ఈ జాతరకు రావడం విశేషం. ఇక్కడ గంగమ్మకు పూజలు నిర్వహించి ఏవైనా మొక్కలు మొక్కుకుంటే అవి సిద్ధిస్తాయని ప్రగాఢ నమ్మకం. అలాగే గ్రామం సుభిక్షంగా ఉండాలని దుష్టశక్తులు గ్రామ పొలిమేరలకు చేరకుండా గంగమ్మ కాపాడుతుందని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. బలిజపల్లి గంగమ్మ జాతర బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది.అనేక సాంప్రదాయాల సమ్మేళనమే ప్రత్యేకత బలిజ పల్లె గంగమ్మ జాతరలో అనేక సాంప్రదాయాల సమ్మేళనం వో విశిష్టతగా చెప్పుకోవచ్చు. మండలంలోని బలిజపల్లి తుమ్మల అగ్రహారం నారపురెడ్డిపల్లి ప్రాంతవాసులు కలసి సంయుక్తంగా ఈ జాతరను నిర్వహిస్తారు. జాతరలో కొలువుతీరే గంగమ్మను వేపచెట్టు కింద దాదాపు 6 గంటల పాటు శ్రమించి సిద్ధపరుస్తారు.అనంతరం గంగమ్మ బ్రతుకును ఊరేగింపుగా గంగమ్మ గుడిలోకి తీసుకువస్తారు అప్పుడు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎదురు గుంభం ఇచ్చేందుకు పోటీలు పడతారు. ముందుగా తుమ్మల అగ్రహారం కు చెందినటువంటి భక్తులు మహిళలు గండ తీయాలను సమర్పిస్తారు. అనంతరం నారపురెడ్డి పల్లి వాసులు అమ్మవారికి నవధాన్యాలు సమర్పిస్తారు ఇలా జాతర సంస్కృతి సాంప్రదాయాల తో భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. భక్తుల కొంగుబంగారంగా వీరాజిల్లుతుంది.
శ్రీ గంగమ్మ జాతర బుధవారం, గురువారం రెండు రోజులు జరుగుతుంది.
జాతర లో విద్యుత్ ద్విపాలు అలంకరణ తొ అమ్మవారి భక్తులు చూడతాగ్గ రెండు కండ్లు సరిపోవు, అమ్మవారి భక్తులు నేడు తెల్లవారుజాము నుండి దున్నపోతు లను, పొట్టేళ్ళు, కోళ్లు, పొంగుబాళ్ళు పెట్టి మిక్కుబడులు తీర్చుకుంటారు.
జాతరలో భక్తుల కోసం అన్నదానలు, మంచినీళ్లు, మజ్జిగ అన్ని ఏర్పాటు చేసేరు.
అనంతరం టెంకాయ అంగళ్ళు, మిఠాయులు, చెరుకు అంగళ్ళు, బొమ్మల అంగళ్ళు, రంగుల రట్నాలు, అనేక రకాల అంగళ్ళ తొ మరియు అనేక అలంకరణలతో జాతర కిక్కిరిసి పోయినది.
జాతర లో ఎలాంటి అల్లర్లు జరగకుండా భక్తుల శాంతి భద్రతల కోసం జిల్లా ఏస్పీ నచికేత్ విశ్వనాధ్ ఆదేశాలు మేరకు, రాజంపేట ఏ ఏస్పీ మనోజ్ రాంనాధ్ హెగ్డే ఆధ్వర్యంలో హోం గార్డ్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ లు దాకా 180 మంది పోలీసు లను బందొబస్త్ గా పెట్టేరు.
జాతర లో భక్తులు గౌరవంగా అమ్మవారి మొక్కలు తీర్చుకొని, దర్శనం చేసుకొని వెళ్లాలని, లేని యడల అల్లర్లు సృష్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.
జాతర లో అల్లరిముకలు మరియు రౌడీ షీటర్లు, మద్యం, గంజాయి తాగి అల్లర్లు చేసిన మరియు రాజకీయ కక్షలతో అల్లర్లు సృష్టిస్తే నాన్ బెయుల్ కేషులు పెట్టి రిమాండ్ కు పంపిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో…. పోలీస్ అధికారులు మరియు అమ్మవారి భక్తులు పాల్గొన్నారు.



