ఒంటిమిట్ట శ్రీ కోదండరామునికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులు.

ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలో మహా పుణ్యక్షేత్రం అయినా ఒంటిమిట్టలో మార్చి 26 వ తేది నుండి 5 తేది వరకు జరుగుతున్న శ్రీరామ నవమి జయంతి బ్రహ్మోత్సవాలు సందర్బంగా నేడు బుధవారం పౌర్ణమి న్నాడు,
శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు, అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో దర్శన ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా సీఎంకి శేషవస్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, ఒంటిమిట్ట రాములవారి చిత్రపటం అందజేశారు.అనంతరం సీఎం దంపతులు శ్రీరాములు వారికి పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తాళంబ్రాలు అందజేసేరు.స్వామి వారి కళ్యాణం అనంతరం ముఖ్యమంత్రి దంపతులు హెలిప్యాడ్ లో విజయవాడ కు వెళ్ళేరు. శ్రీరాముల కల్యాణనికి ఆంధ్రప్రదేశ్ నూలుముల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని టీటీడీ వారి లడ్డు ని ప్రసాదంగా స్వీకరించి, భోజనాలు చేసి ఎవరి ప్రదేశలకు వాళ్ళు గమ్యం చేరుకున్నారు.ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణం కనివిని రూపం లో కేరళ వారిచే వాయుధ్యాలు, కోలాటలు, నాట్య నృత్యలు, చక్కభజనలు, మరియు విద్యుత్ కాంతుల అలంకరణ లు చూసేదానికి ఆనందం ఉందని భక్తులు అన్నారు.కల్యాణనికి వచ్చిన భక్తులకు తిరుపతి తిరుమల దేవస్థానం అధికారులు మంచినీళ్లు, మజ్జిగ,బిస్కెట్స్, ఫ్రూట్స్, అన్నప్రసదం లు మరియు లడ్డుని ప్రసాదం గా అందజేసేరు.మరియు భక్తులకు రాష్ట్రం నలుమూలల నుండి బస్సు సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో… టీటీడీ దేవస్థాన అధికారులు, యన్ డి ఏ కూటమి నాయకులు, జిల్లా ఏస్పీ షెల్కె నచికేత్ విశ్వనాధ్, జిల్లా కలెక్టర్ చామాకూరి శ్రీధర్, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, స్థానిక సీఐ నరసింహ రాజు, ప్రభుత్వ అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు.



