Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Ananthapuram

“టెన్త్ క్లాస్” పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు…. జిల్లా ఏస్పీ.

అనంతపురం జిల్లా, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మార్చి 16 వ తేది నుండి ఏప్రిల్ 1 తేది వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్బంగా, జిల్లా ఏస్పీ పి. జగదీష్ ఐపీఎస్, మాట్లాడుతు….. అనంతపురం జిల్లాలో సోమవారం నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా మరియు సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టే మన్నారు. జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 143 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు మరియు 31,972 మంది విద్యార్థులు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసేమాన్నారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేసేమని,అలాగే పరీక్షా పత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో మరియు సమాధాన పత్రాలను తిరిగి తీసుకెళ్లే సమయంలో కూడా పోలీసు బందోబస్తు కల్పిస్తున్నమన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉంటుందని, కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అనవసరంగా వ్యక్తులు గుమిగూడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.
జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలలో సంబంధిత పోలీసు అధికారుల ఆధ్వర్యంలో అవసరమైన మేరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవకతవకలు, మాస్ కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్ జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసేమన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు మరియు పరీక్ష విధులు నిర్వహించే సిబ్బంది తప్ప ఇతరులు ఎవరూ ఉండరాదని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎవరైనా మాస్ కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా లేదా వారికి సహకరించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు పోలీసు శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button