Telangana

అత్యుత్తమ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: శ్రీనివాసరావు.

పల్లె వాణి మహబూబాబాద్, మే.20:2026-2027 విద్యా సంవత్సరమునకు అర్హులైన ఎస్సీ/ఎస్టి/బీసీ/ఈబీసీ/మైనారిటీ విధ్యార్థులు అత్యుత్తమ జూనియర్ కళాశాలలో ప్రవేశమునకు ఆన్ లైన్ లో ధరఖాస్తులు అహ్వనించబడుచున్నవని మార్చి/2026 లో 10 తరగతి నందు 7.0 జిపిఎ, ఆపై గ్రేడు పొందిన విధ్యార్థులు మాత్రమే అర్హులు. ప్రభుత్వ షెద్యూల్డు కులముల వసతి గృహములు/ఆశ్రమ పాఠశాలలు/కస్తూరిబా పాఠశాల మరియు ప్రభుత్వ, మున్సిపల్, జిల్లా పరిషత్ మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదివిన విధ్యార్థులు (డే స్కాలర్స్ ) మరియు ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్, జవహర్ నవోదయ విద్యాలయాల విధ్యార్థులు మరియు బెస్ట్ అవైలబుల్ స్కీం క్రింద చదివిన విధ్యార్థులు మాత్రమే ధరఖాస్తులు చేసుకోవచ్చునని జిల్లా షెడ్యుల్ కులాల అభివృద్ధి అధికారి శ్రీనివాస రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.విధ్యార్థుల తల్లితండ్రుల వార్షిక ఆదాయం ఎస్సీ/ఎస్టి లకు రూ. 2.00 లక్షలు (రూపాయలు రెండు లక్షలు మాత్రమే) మరియు బీసీ/ఈవీసీ/మైనారిటీ విద్యార్థులకు రూ. 1.00 లక్ష (రూపాయలు ఒక లక్ష మాత్రమే) మించరాదన్నారు.
ధరఖాస్తు చేసుకొనే విధ్యార్థులు తేది 21-05-2026 నుండి 05-06-2026 వరకు ఈ-పాస్ వెబ్ సైట్ ద్వారా (https://telanganaepass.cgg.gov.in) ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోగలరు మరియు ధరఖాస్తుతో పాటు ఈ క్రింద తెలిపిన దృవీకరణ పత్రములు జతచేయవలెనన్నారు.1. 10వ తరగతి పాస్ మెమో,
2. కులము, ఆదాయ దృవీకరణ పత్రములు మీ-సేవా ద్వారా పొందినవి ,3. బ్యాంకు పాస్ బుక్ ,4. అధార్ కార్డ్ నెంబర్
,5. రేషన్ కార్డ్ నెంబర్ వివరములు,6. పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
,7. ప్రభుత్వ షెద్యూల్డు కులముల వసతి గృహముల విధ్యార్థులు (3) సంవత్సరంల బోనోఫైడ్ దృవీకరణ పత్రము జతపర్చవలెనన్నారు. ఆన్ లైన్ లో ఈ-పాస్ వెబ్ సైట్ నందు ధరఖాస్తు చేసుకునేటప్పుడు విధ్యార్థులు ప్రాధాన్యత క్రమములో (3) కళాశాలలను ఎంపిక చేసుకోవలెను. ధరఖాస్తు ప్రక్రియ ముగిసిన పిదప ఈ-పాస్ సిస్టమ్ ద్వారా విద్యార్థుల ఎంపిక ఆటోమేటిక్ గా జరుగును మరియు కళాశాలలు అలాట్ చేయబడునని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button