Andhra Pradesh

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలి: మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

ఏలూరు జిల్లా ​పోలవరం నియోజకవర్గం: మార్చి 11 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనాలని పోలవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్చార్జ్ తెల్లం బాలరాజు గారు పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీన (గురువారం) నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో, గ్రామాల్లో నిర్వహించే జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఆయన ఆదేశించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ స్థానిక నాయకత్వంతో కలిసి కార్యకర్తలు వేడుకలను ఘనంగా నిర్వహించాలని, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని కోరారు.
“పార్టీ ఆవిర్భావ దినోత్సవం మనందరి ఆత్మగౌరవ ప్రతీక. అందుకే ఏ ఒక్క గ్రామం, ఏ ఒక్క మండలం మినహాయించకుండా అన్ని చోట్లా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి” అని తెల్లం బాలరాజు గారు స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button