యు పి యస్ సి. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష–2026 కేంద్రాలను తనిఖీ చేసిన….. జిల్లా కలెక్టర్,, జిల్లా ఎస్పీ

తిరుపతి జిల్లా: తిరుపతి పట్టణంలో నేడు ఆదివారం నిర్వహిస్తున్న “యు పి యస్ సి” సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు–2026 సందర్భంగా, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్. మరియు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. లు పరీక్ష కేంద్రాలను సందర్శించి తనిఖీలు చేసేరు.
ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం మరియు శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
పరీక్షల నిర్వహణ విధానం, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, హాల్‌లో అమలు చేస్తున్న నిబంధనలను అధికారులు పరిశీలించారు.
జిల్లా ఎస్పీ, కేంద్రాల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.
అలాగే మధ్యాహ్నం నుండి నిర్వహించనున్న రెండవ పేపర్‌కు సంబంధించి అభ్యర్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక పోలీసు బందోబస్తు, సీసీ కెమెరా పర్యవేక్షణ తదితర ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న అధికారులతో మాట్లాడి సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.



