Andhra Pradesh

దివ్యంగులకు ఉచిత బస్సు ను ప్రారంభోత్సవం చేసిన…. సబ్ కలెక్టర్.

కడప జిల్లా, రాజంపేట : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు నేడు బుధవారం పార్లమెంట్ మరియు అసెంబ్లీ స్థానమైన రాజంపేట ఆర్టీసీ బస్సుస్టాండ్ డిపో లో సబ్ కలెక్టర్ హెచ్ యస్. భావన ఐఏఎస్, దివ్యంగ శక్తి పథకం క్రింద, దివ్యంగులకు ఉచిత బస్సు ని ప్రారంభోత్సవం చేసేరు.
సబ్ కలెక్టర్ భావన మాట్లాడుతు…. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మన ఆంధ్రప్రదేశ్ లో దివ్యంగులకు కేంద్ర రైల్వే శాఖ రైలు లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించారని, రైలు తప్పిపోతే ప్రయాణం చేయాలంటే దివ్యంగులు చాల ఇబ్బంది పడుతున్నారని అందుకే దివ్యంగుల కోసం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేటి నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారాని ఆలాగే దివ్యంగులు బస్సు లొకి ఎక్కగానే ప్రయాణికులు దివ్యంగులను గౌరవించి సీట్లు లలో కూర్చొనివ్వలన్నారు. 2024 సంవత్సరములో ఏపీ సీఎం, ఎన్నికల ప్రచారం లో దివ్యంగుల పింఛన్ లు పెంచుతామన్నారు, తెలుగుదేశం పార్టీ అధికారం లొకి రాగానే దివ్యంగుల పింఛన్ లు పెంచి, ఒకటవ తారీకు రాగానే పింఛన్ లు ఇస్తున్నారన్నారు.
అలాగే దివ్యంగుల ను బస్సు లొకి ఎక్కించి కండక్టర్ దివ్యంగుల దగ్గర ఉచిత టికెట్ కొట్టి శుభాకాంక్షలు తెలిపారు. బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి తరువాత ఆర్టీసీ బస్టాండ్ లో దింపి భోజన సౌకర్యలు కల్పించారు. ఈ కార్యక్రమంలో అర్టీసీ డిపో మేనేజర్ కె. గోవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, యన్డిఏ కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button