Telangana

ప్రజా వ్యతిరేక బడ్జెట్ మాకు వద్దు:డా. వివేక్.

ప్రజా వ్యతిరేక బడ్జెట్ మాకు వద్దు.

డి ఎస్ ఎఫ్ ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మార్చి 21:ప్రజావ్యతిరేక బడ్జెట్ మాకు వద్దని, డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ అన్నారు. ఈ మేరకు మహబూబాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పత్రులను చించి నీరసన వ్యక్తం చేశారు.డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు మాట్లాడుతు,రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్ లో విద్యారంగానికి జరిగిన కేటాయింపులపై అసహనం వ్యక్తం చేసారు.ఈ బడ్జెట్ విద్యార్థుల భవిష్యత్ ను అంధకారం లో నెట్టేలా ఉంది అని విమర్శించారు.గత ఏడాది తోపోలిస్తే,ఈబడ్జెట్లో విద్యారంగానికికేవలం.0.6% మాత్రమే పెంపుదల చూపించడం శోచనీయం అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని, ఇది పేద విద్యార్థులకు నాణ్యమైన చదువును దూరం చేయడమేనని డాక్టర్ వివేక్ మండిపడ్డారు.విద్యాశాఖకు కేటాయించిన నిధులు కేవలం జీతభత్యాలకే సరిపోతాయని, నూతన విద్యా పథకాల అమలుకు లేదా పరిశోధనలకు తావులేకుండా పోయిందని ఆయన ఆరోపించారు.పెరుగుతున్న జనాభా, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యా బడ్జెట్ భారీగా పెరగాల్సింది పోయి, కేవలం 0.6% పెంపుతో ప్రభుత్వం చేతులు దులుపుకోవడం విద్యార్థి లోకాన్ని వంచించడమే అని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచించి, విద్యారంగానికి అదనపు నిధులు కేటాయించాలని, లేనిపక్షంలో విద్యార్థి లోకం తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని డాక్టర్ వివేక్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయికుమార్ రాష్ట కోశాధికారి గుగులోత్ సూర్య ప్రకాష్. రాష్ట నాయుకులు భూక్యా శ్రీకాంత్. జిల్లా నాయుకులు మాలోత్ రమేష్, సురభి సాయి. రెండ్ల సంతోష్. బిర్రు గౌతమ్ ,నగేష్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button