TelanganaUncategorized

చిన్న గూడూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లామార్చి 20:గురువారం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ చిన్ని గూడూరు పోలీస్ స్టేషన్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, కార్యాలయం లోపలి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. ఎస్సై ప్రవీణ్ మరియు సిబ్బందికి విధి నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం పై పలు సూచనలు చేశారు.ముఖ్యంగా అక్రమ కార్యకలాపాలపై ఎలాంటి జోక్యం ఉండకూడదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.అలాగే స్థానిక సర్పంచ్‌లతో పరస్పరం మాట్లాడి, గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరంపై చర్చించారు. గ్రామ భద్రతలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణలో సర్పంచ్‌లు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా హెల్మెట్ వాడకం పై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, అవసరమైతే గ్రామాల్లో తమతమ స్థాయిలో ప్రచారం చేపట్టాలని సూచించారు.జిల్లాలో నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత మరియు ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని ఎస్పీ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button