Andhra Pradesh

రిటైర్డ్ అయినా పోలీస్ సిబ్బందికి సన్మానించిన…. జిల్లా ఏస్పీ

తిరుపతి జిల్లా : తిరుపతి పోలీస్ ప్రధాన కార్యాలయం లో నేడు గురువారం జిల్లా ఏస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్, ఏప్రిల్ నెలలో రిటైర్ అయినా పోలీస్ సిబ్బందికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించి,దీర్ఘకాల సేవలందించిన అధికారులను, సిబ్బందిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. పోలీస్ శాఖకు వారు అందించిన సేవలు, క్రమశిక్షణ, నిబద్ధతను ఉన్నతాధికారులు ప్రశంసించారు.నేడు రిటైర్ అయిన సిబ్బంది: యస్ ఐ,ఎం. నజీర్ బేగ్ మరియు ఏ యస్ ఐ, పి. భారత్ కుమార్ మరియు హెడ్ కానిస్టేబుల్, జి. రాఘవులు మరియు హెడ్ కానిస్టేబుల్ డి. కనక రాజ్ మరియు ఏ ఆర్ హెచ్ సి, ఏ. నంద కుమార్ లు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్, మాట్లాడుతు…. పోలీస్ సేవ అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా సమాజానికి అంకితమైన సేవ అని, ప్రజల భద్రత కోసం చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండి పోతాయన్నారు. అలాగే పోలీస్ శాఖ తరఫున రిటైర్ అవుతున్న సిబ్బందికి ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేసి, వారి సేవలకు కుటుంబ సభ్యుల సహకారం ప్రశంసనీయం అని పేర్కొన్నారు.
అనంతరం వారి నిబద్ధత, క్రమశిక్షణ యువ పోలీస్ సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని, రిటైర్మెంట్ అనంతరం కూడా సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు.
రిటైర్మెంట్ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ మీ సేవలకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాయని, అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.
రిటైర్ అయిన సిబ్బంది తమ సేవా కాలాన్ని గుర్తుచేసుకుంటూ పోలీస్ శాఖలో పనిచేయడం గర్వకారణమని, విధుల్లోని అనుభవాలు జీవితానికి విలువైన పాఠాలుగా నిలిచాయన్నారు.
జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమం మరపురాని అనుభూతిగా నిలిచిందని, పోలీస్ శాఖతో అనుబంధం కొనసాగుతుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు (పరిపాలన), శ్రీనివాసులు (క్రైమ్స్), శ్రీనివాస రావు (సాయుధ దళం), ఎస్‌బి డిస్పి శ్రీమతి గీతా కుమారి, అసోసియేషన్ ప్రెసిడెంట్ సోము, గౌరవ అధ్యక్షులు నిరంజన్, సెక్రటరీ శంకర్ రెడ్డి, సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button