CrimeTelangana

నల్ల బెల్లాన్ని తరలిస్తున్న వాహనం సీజ్, పలువురుపై కేసు నమోదు:ఎస్సై.

పల్లె వాణి నెల్లి కుదురు ఏప్రిల్ 1:నల్ల బెల్లాన్ని తరలిస్తూన్న వాహనాన్ని సీజ్ చేసి, పలువురు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం బుధవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నెల్లికుదురు మండలంలోని నైనాల క్రాస్ వద్దకు వెళ్లేసరికి అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల నల్లబెల్లం, ఒక్క బస్తా పటిక , 5 లీటర్ల గుడుంబా తరలిస్తున్న బొలెరో ట్రాలీ పట్టుకొని అందులో ఉన్న వ్యక్తులను పట్టుకొని వివరాలు తెలుసుకోగా మహబూబాబాద్ మున్సిపాలిటీ గ్రామం ఏటిగడ్డ తండా కు చెందిన బానోత్ కిరణ్,. గూడూరు గ్రామం అలకుంట్ల అనిల్ గా చెప్పగా వారి మీద వారితో పాటు ఉండి పారిపోయిన ఆవులేగా తండాకు చెందిన గూగులోత నరేష్ బంజర గ్రామానికి చెందిన బానోత్ సాయి కిరణ్ అను వ్యక్తుల మీద కేసు నమోదు చేశామని పట్టుకున్న వాటి విలువ రెండు లక్షల ఏడు వేలు ఉంటుందని, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్సై పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button