వాహన ధారులకు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం…. యస్ ఐ, పి.హారిక

కడప జిల్లా : సిద్దవటం మండలం సబ్ ఇన్స్పెక్టర్ పోకల హారిక మీడియతో మాట్లాడుతు….. కడప జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ (యస్ పి ) సెల్కె నచికేత్ విశ్వనాధ్ ఐపీస్ ఆదేశాలు మేరకు నేడు శనివారం,
సిద్దవటం సమీపంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనదారులకు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించమన్నారు.
పోర్ విల్ వాహనధారులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ఆలాగే డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్, ఆర్ సి, ఇన్సూరెన్స్ తప్పని సరిగ్గా ఉండాలని అలాగే మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ లో సెల్ ఫోన్ మాట్లాడటం ప్రమాదకరమని హెచ్చరించారు.
అనంతరం రోడ్డు ప్రమాదాల వల్ల ఒక కుటుంబం ఆర్ధికంగా ఎంతో నష్టపోతుందని, కుటుంబ పెద్ద తీవ్రంగా గాయపడితే కుటుంబ సభ్యుల మనో వేదన లాంటి దుస్థితి ఎవ్వరికీ రాకూడదని,అందరూ తమ వంతు బాధ్యత గా రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో…. ఏ యస్ ఐ, హెడ్ కానిస్టేబుల్, పోలీసులు పాల్గొన్నారు.



