Andhra Pradesh

ఘనంగా శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

కడప జిల్లా, జమ్మలమడుగు : తిరుపతి తిరుమల టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో జమ్మలమడుగు లోని పురాతన ప్రసిద్దిగాంచిన శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి నేటి నుండి బ్రహ్మోత్సవాలు సందర్బంగా నేడు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు.
అనంతరం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.
శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టారు.
మే 1వ తేదీ శుక్ర‌వారం ఉదయం 9. 30 నుంచి 10.15 గంటల మధ్య మిథున‌ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఈ కార్యక్రమంలో…. దేవస్థానం కమిటీ నెంబర్లు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button