Andhra Pradesh
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలుకు జిల్లా ఏస్పీ కి ఆహ్వానం

నెల్లూరు జిల్లా, నెల్లూరు పోలీస్ ప్రధాన కార్యాలయం లో నేడు శుక్రవారం జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ డా. అజిత వేజెండ్ల ఐపీస్ ను, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం ప్రతినిధులు ఆహ్వానించారు.గరుడోత్సవం సహా ప్రధాన ఉత్సవాలకు సుమారు 10 వేల మంది భక్తులు హాజరవుతారని అధికారులు తెలిపారు.భక్తుల రద్దీ దృష్ట్యా భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, క్యూలైన్లపై ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో… దేవస్థానం కమిటీ అధికారులు పాల్గొన్నారు.



