Telangana

పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మార్చి 28:శనివారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్,చిన్న గూడూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల సరళిని పరిశీలించారు.మార్చి 14 తేదీ నుండి జిల్లాలోని (45) పరీక్షా కేంద్రాల ద్వారా (8157) మంది విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వ సూచనల ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్స్ (3) సిట్టింగ్ స్క్వాడ్స్ ప్రతీ కేంద్రానికి ఒక్కటి, సుమారు (528) పరీక్షల నిర్వహణ సిబ్బంది, (45) వైద్య బృందాల సిబ్బంది, అదనపు కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, నిత్య పర్యవేక్షణలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు కొనసాగడం జరుగుతుందన్నారు.చీఫ్ సూపర్డెంట్లు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాల ఓపెనింగ్, క్లోజింగ్ ప్రక్రియ, విద్యాశాఖ ప్రధాన కార్యాలయం నుండి వైర్లెస్ సెట్ ద్వారా పర్యవేక్షణ సూచనలు జారీ చేస్తున్నారని, ఈరోజు డీఈవో వి.రాజేశ్వర్, డోర్నకల్, కురవి (6) ఏజిసి మందుల శ్రీరాములు మహబూబాబాద్, గార్ల, బయ్యారం, 6 కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ (18) కేంద్రాలలో జరుగుతున్న పరీక్షల సరళని తనిఖీ చేశారనీ,
ఈ రోజు (8165) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై 99.89 శాతం నమోదు అయ్యిందని తెలిపారు, ఏప్రిల్ 16 వరకు జరిగే పరీక్షల నిర్వహణలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉందని తెలిపారు,
అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి, రికార్డులను హాజరు, వివరాలను, స్టాకును తనిఖీ చేశారు,పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తూ వారికి అర్థమయ్యే విధంగా విద్యను అందించాలని సూచించారు, అంగన్వాడి కేంద్రం పరిధిలో ఉన్న శ్యామ్, మ్యామ్, పిల్లలను గమనిస్తూ ఉండాలని, బాలింతలకు, గర్భిణీలకు, చిన్నపిల్లలకు, బలవర్ధకమైన పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు,
అంగన్వాడీ టీచర్లు, పిల్లల హాజరు శాతం పూర్తిస్థాయిలో ఉండాలన్నారు,
అన్ని విద్యాసంస్థలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ లపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రత్యేక అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు,
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button