పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్లీ క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి. యుద్ధం కారణంగా ఈ లోహాల ధరలు మరింత భారీగా పెరిగే అవకాశముందని అంచనాలు వెలువడినప్పటికీ గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో స్థిరీకరణకు గురవుతున్నాయి (Gold prices). ఈ రోజు (మార్చి 4న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,67,610 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,640 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,67,760కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,53,790కి చేరుకుంది.
మరోవైపు వెండి ధర కూడా తగ్గుదల నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర మూడు లక్షల రూపాయల దిగువకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
- హైదరాబాద్‌లో రూ.1,67,610, రూ.1,53,640
- విజయవాడలో రూ.1,67,610, రూ.1,53,640
- ఢిల్లీలో రూ.1,67,760, రూ.1,53,790
- ముంబైలో రూ.1,67,610, రూ.1,53,640
- వడోదరలో రూ.1,67,660, రూ.1,53,690
- కోల్‌కతాలో రూ.1,67,610, రూ.1,53,640
- చెన్నైలో రూ.1,67,610, రూ.1,53,640
- బెంగళూరులో రూ.1,67,610, రూ.1,53,640
- కేరళలో రూ.1,67,610, రూ.1,53,640
- పుణెలో రూ.1,67,610, రూ.1,53,640
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
- హైదరాబాద్‌లో రూ.3,14,900
- విజయవాడలో రూ.3,14,900
- ఢిల్లీలో రూ.2,94,900
- చెన్నైలో రూ.3,14,900
- కోల్‌కతాలో రూ.2,94,900
- కేరళలో రూ.3,14,900
- ముంబైలో రూ.2,94,900
- బెంగళూరులో రూ.2,94,900
- వడోదరలో రూ.2,94,900
- అహ్మదాబాద్‌లో రూ.2,94,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.