ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు పక్కడ్బెందిగా భద్రత ఏర్పాట్లు…. జిల్లా ఏస్పీ

కడప జిల్లా, కడప : కడప సూపర్ డెంట్ అఫ్ పోలీస్ కార్యాలయం లో నేడు గురువారం విలేకరుల సమావేశం జిల్లా ఏస్పీ సెల్కె నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, మాట్లాడుతు….. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, కడప జిల్లా లోని రెండవ భద్రాచలం గా పిలవబడే మహా పుణ్యక్షేత్రం అయినా ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండ రాములు బ్రహోత్సవాలు, ఈ నెల 26 వ తేది గురువారం నుండి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలుకి చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కోదండ రామాలయం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రదేశాలు, కల్యాణ వేదిక పరిసరాల వద్ద చేపట్టాల్సిన భద్రతా చర్యలపై రాజంపేట ఏ.ఎస్.పీ రామనాథ్ హెగ్డే కు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా వాహనాలు వెళ్లేలా ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పలువురు విఐపీ లు, వివిఐపిలు ఉత్సవాలకు హాజరు కానున్న నేపథ్యంలో తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్ ) కె. ప్రకాష్ బాబు, అడిషనల్ ఎస్పీ (ఎ.ఆర్)బి. రమణయ్య, రాజంపేట ఏఎస్పీ రామనాథ్ హెగ్డే , స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ఎన్.సుధాకర్, ఒంటిమిట్ట సి.ఐ నరసింహ రాజు తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.



