హనుమాన్ జయంతి శాంతియుతంగా జరుపుకోవాలి….. జిల్లా ఏస్పీ,, జిల్లా కలెక్టర్

కడప జిల్లా, కడప : హనుమాన్ జయంతి ఉత్సవ కార్యక్రమాలను శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేయాలని జిల్లా ఏస్పీ సెల్కె నచికేత్ విశ్వనాధ్ ఐపీస్ మరియు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి లు, పోలీసు అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన.. ఈ నెల 12న హనుమాన్ జయంతి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల శాంతి భద్రతలపై, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసీ డా. నిధి మీనా, కడప నగర కమిషనర్, రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన ఐఏఎస్ లతో కలిసి.. పోలీసు, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….. కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి ఏడాది సంప్రదాయంగా, హనుమాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతోందన్నారు. తాజాగా కడప నగరంలోని అల్మాస్ పేటలో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో, నగరంలో జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవ వేడుకలను కొన్ని షరతులకు లోబడి శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను కల్పించడం జరుగుతుందన్నారు. అందుకు సంబంధించి ఉత్సవ కమిటీ సభ్యులకు సంబందిత ఏర్పాట్లపై క్షుణ్ణంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆయా శాఖల అధికారులు సంబంధిత ఏర్పాట్లను నిర్ణీత సమయం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
నగరంలోని ఉత్సవ ర్యాలీ నిర్వహించే అన్ని ప్రాంతాల్లో, సెన్సిటీవ్ ఏరియాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
అలాగే ఆయా ప్రాంతాల్లో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి, ఉత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని సంబందిత శాఖల అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కడప నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవ ర్యాలీలో బాణసంచాలు, డీజేలు, అన్నదానం వంటి కార్యక్రమాలు నిషేదించడమైనదన్నారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ….. భక్తుల మనోభావాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కొన్ని భద్రతా ప్రమాణాల షరతులకు మేరకు ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, జిల్లా పోలీసు యంత్రాంగం తరుపున అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ఎక్కడా, ఎలాంటి చిన్న పొరపాటుకు కూడా అవకాశం లేకుండా.. ఈ ఏడాది కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలను, ర్యాలీని విజయవంతం చేసేందుకు పోలీసు యంత్రాంగం నుండి సంపూర్ణ సహకారాలు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో….. కడప ఆర్డీవో మురళి, కేఎంసి అదనపు కమీషనర్ రాకేష్ చంద్రం, డీఎస్పీలు అన్ని విభాగాల పోలీసు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



