Telangana
బాలాజీ పేటలో సామూహిక శ్రీమంతం, అక్షరాభ్యాస కార్యక్రమం.

పల్లె వాణి బయ్యారం ఏప్రిల్ 20: బయ్యారం మండలంలోని బాలాజీ పేట గ్రామంలోనీ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సరదాభి పాల్గొని మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రం నుండి అందుకునే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎం ఎల్ హెచ్ వి రాజేశ్వరి, ఏఎన్ఎం వనిత వార్డ్ మెంబర్ గూగుల్లోతు కిషన్, అంగన్వాడీ టీచర్ సరోజ,జ్యోతి, సునీత, ఆశా వర్కర్ సురాంబా . సుజాత,రాణి తదితరులు పాల్గొన్నారు.



