Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Andhra PradeshPolitical

జిల్లాలో 1160 మంది లబ్ధిదారుల సామూహిక గృహ ప్రవేశాలు

ఏలూరు : ఏలూరు జిల్లాలో సామూహిక గృహప్రవేశాలలో భాగంగా 1160 మంది పిఎంఏవై, ఎన్టీఆర్ గృహ లబ్దిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఉంగుటూరు మండలం అప్పారావుపేటలో సోమవారం పిఎంఏవై, ఎన్టీఆర్ గృహ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో పిఎంఏవై, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పధకం కింద 82 వేల 443 మంది పేదలకు ఇళ్ళు మంజూరు చేయడం జరిగిందని, వాటిలో ఇప్పటివరకు 45 వేల 089 ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయి లబ్దిదారులకు అందించడం జరిగిందన్నారు. మరో 1160 ఇళ్ల లబ్దిదారులకు గృహాలను అందించడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో సోమవారం పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించి లబ్దిదారులకు గృహాలను అందించడం జరిగిందన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో 123 ఇళ్ళు , దెందులూరులో నియోజకవర్గంలో 89, ఏలూరు లో 502, గోపాలపురంలో 12, కైకలూరులో 172, నూజివీడులో 119, పోలవరంలో 91, ఉంగుటూరు నియోజకవర్గంలో 52 ఇళ్ల నిర్మాణాలు పూర్తిఅయ్యాయయని, వాటిని లబ్దిదారులకు అందించడం జరిగిందన్నారు.ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ పేదరికమే అర్హతగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఎన్టీఆర్ గృహాన్ని మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 5162 మంది లబ్దిదారులకు పిఎంఏవై, ఎన్టీఆర్ గృహాలను మంజూరు చేయడం జరిగిందని, వీరిలో 4195 మందికి గృహ నిర్మాణాలు పూర్తిచేసి అందించడం జరిగిందన్నారు. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులను త్వరలో పూర్తిచేసి లబ్దిదారులకు అందించడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా అప్పారావుపేటలోని గృహ లబ్దిదారురాలు శ్రీమతి టి. నాగలక్ష్మి గృహప్రవేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని మహిళా లబ్దిదారులకు గృహాల తాళాలను కలెక్టర్, ఎమ్మెల్యేలు అందించారు. అంతకుముందు గ్రామంలో పిఎం సూర్యఘర్ యోజన పధకం కింద లబ్ధిదారులు ఏర్పాటుచేసుకున్న సోలార్ యూనిట్ ను, ఉంగుటూరులో లో ఓల్టేజ్ సమస్య పరిష్కారానికి గాను ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్ ను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లు ప్రారంభించారు. కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్డీఓ దేవకీదేవి, గృహ నిర్మాణ శాఖ పీడి సత్యనారాయణ, ట్రాన్స్కో ఎస్ ఈ సాల్మన్ రాజు, ఈఈ అంబేద్కర్, తహసీల్దార్ పూర్ణ ప్రసాద్, ఎంపిపి ఘంటా శ్రీలక్ష్మి, ఎంపిడిఓ గంజి రాజ్ మనోజ్, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, తహసీల్దార్లు, రెవిన్యూ అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button