Andhra Pradesh
మహాత్మ బసవ జయంతి సందర్భంగా ఘన నివాళులు…. జిల్లా ఏస్పీ

తిరుపతి జిల్లా : తిరుపతి సూపర్ డెంట్ అఫ్ పోలీస్ కార్యాలయం లో నేడు సోమవారం మహాత్మ భసవ జయంతి సందర్బంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, మహాత్మ భషవేశ్వరుని చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతు….. మహాత్మ బసవేశ్వరుడు సమాజంలో సమానత్వం, న్యాయం, సత్యం కోసం చేసిన సేవలు అమోఘమని తెలిపారు. ఆయన బోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, ముఖ్యంగా యువత ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో…. అదనపు ఎస్పీలు వెంకటరావు (పరిపాలన) శ్రీనివాసరావు (సాయిదళం) గీతా కుమారి (ఎస్ బి) మరియు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని మహాత్మ బసవేశ్వరుని సేవలను స్మరించుకున్నారు.



