Andhra Pradesh

పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మద్దు….. జిల్లా ఏస్పీ,, జిల్లా కలెక్టర్

తిరుపతి : తిరుపతి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని జిల్లా ఏస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఐఏఎస్ లు తెలిపారు. అలాగే కృత్రిమ కొరతను అదునుగా తీసుకొని బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఏస్పీ లుతిరుపతి పట్టణంలోని మహతి ఆడిటోరియం సమీపంలోని పెట్రోల్ బంకును తనిఖీ చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఏస్పీ మాట్లాడుతు….. జిల్లాలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాత్కాలికంగా కొన్ని అవుట్‌లెట్లలో సమస్య ఉన్నప్పటికీ త్వరలోనే సరఫరా చేస్తామన్నారు.
సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దని, ఇతర ధృవీకరించని వేదికల్లో వస్తున్న అసత్య ప్రచారాల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. అవసరం లేకపోయినా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరుగుతోందన్నారు. రోజువారీ అవసరాలకు సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని, ప్రజలు సహనం పాటించి అవసరమైన మేరకు మాత్రమే ఇంధనం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button