ప్రజావాణి వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా ఏప్రిల్ 27:ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరంలో సంబంధిత అన్ని విభాగాల అధికారులతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లావ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగానికి సిఫారసు చేయాలని, ప్రతి దరఖాస్తులు పారదర్శకంగా పరిశీలించాలని, సూచించారు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన అన్ని కార్యక్రమాలను అందరూ సమిష్టిగా విజయవంతం చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో మరింత పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు, ప్రజావాణి దరఖాస్తులను కూడా పరిష్కరించాలని కోరారు.ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు జరిగే స్వీయ జన గణన కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు తమ పరిధిలో ఉన్న ప్రతి ఉద్యోగులు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.ప్రజావాణిలో వివిధ శాఖలలో మొత్తం (179) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు,
మరిపెడ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 264లో గల 02 ఎకరాల 16 గుంటల ప్రభుత్వ భూమిని, నిరుపేదలైన సుమారు 30 మంది పాత్రికేయులకు నివాస గృహాల కోసం కేటాయించాలని మరిపెడ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.
పెండింగ్లో ఉన్న భూ మార్పిడి, వారసత్వ హక్కులు మరియు ఇతర ధరణి సంబంధిత సమస్యలను పరిష్కరించాలని పలువురు రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
కొత్త రేషన్ కార్డుల మంజూరు మరియు ఆసరా పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారుల నుండి వినతులు అందాయి.
డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు తాగునీటి సమస్యలపై ప్రజలు కలెక్టర్కు విన్నవించారు.ప్రజావాణి కార్యక్రమం సమయం పూర్తి అయిన అదనంగా రెండున్నర గంటల వరకు దరఖాస్తులతో వేచి ఉన్న ప్రజల యొక్క వినుతులను స్వీకరించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, మండల కేంద్రాలలోని గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులకు సమస్యలను వివరించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో మహబూబాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారినీ కృష్ణవేణి, జిల్లా పరిషత్ సీఈవో పురుషోత్తం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మధుసూదన రాజు, అన్ని విభాగాల జిల్లా అధికారులు,పర్యవేక్షకులు మదన్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.



