Andhra Pradesh

జిల్లాలో జనగణన కార్యక్రమంను వెంటనే పూర్తిచేయాలి

ఏలూరు, జూన్, 5 : జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని వెంటనే పూర్తిచేసి, నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో జనగణన కార్యక్రమం పై శుక్రవారం సాయంత్రం తహసీల్దార్లు, రెవిన్యూ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫెరెన్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బముగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జనగణన ను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయవలసిన బాధ్యత తహసీల్దార్లదేనని, జనగణన ను పూర్తి చేయని అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గత గణగణన జనాభా వివరాలతో పోల్చి చూసి , అధిక సంఖ్యలో హెచ్చు, తగ్గులు ఉన్న ప్రాంతాలలో గణన కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. శాశ్వత వలసదారులు సక్రమంగా నమోదు చేయాలనీ , చనిపోయిన వారి వివరాలను నిబంధనల మేరకు డాకుమెంట్స్ పరిశీలించి తొలగించాలన్నారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాలలో జనగణనలో ఎన్యూమరేటర్లు జాగ్రత్తగా గణన చేయాలన్నారు. ఎట్టిపరిస్థితులలోనూ జనగణన ప్రక్రియను వెంటనే పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి యల్.దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, ఆర్డీఓ లు లక్ష్మిప్రసన్న, రమణ, తహసీల్దార్లు, ఎంపిడిఓ లు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button