Andhra Pradesh

అభివృద్ధి బాటలో పుల్లంపేట….. మాజీ సర్పంచ్ అకేపాటి

తిరుపతి జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం, పుల్లంపేట గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ అకేపాటి శ్రీనివాసులు రెడ్డి నేడు మంగళవారం మీడియతో మాట్లాడుతు….. 2021 వ సంవత్సరము పుల్లంపేట పంచాయతీ ప్రజల ఆశీర్వాదం తొ నేను 726 ఓట్ల మెజారిటీ తొ పుల్లంపేట సర్పంచ్ గా గెలుపొంది, ఆయుదు సంవత్సరాల గడువులో నేను పుల్లంపేట పంచాయతీ లో సీసీ రోడ్లు మరియు అనేక అభివృద్ధి పనులు చేసేను. ముస్లిం మరియు హిందూ స్మశానం లో ప్రహరీ గోడలు నిర్మించాను.
భవన ఋషి దేవస్థానం దగ్గర వర్షపు నీరు అధికంగా నిల్వ ఉంటున్న కారణంగా గ్రామంలోని ప్రజలు శివాలయం కు పోవాలన్న మరియు గ్రామంలోకి వెళ్లాలన్నా భవన ఋషి దేవస్థానం దగ్గర ఉన్న మురికి నీటిలో నుంచి పోవలెను, అందువలన గ్రామంలోని ప్రజలు మరియు బనరుషి గుడి కమిటీ సభ్యులు కలిసి పుల్లంపేట మండల అధ్యక్షులు ముద్దా వెంకట సుబ్బారెడ్డి అలియాస్ బాబుల్ రెడ్డిని కలిసి భవన ఋషి గుడి దగ్గర ఉన్న సమస్య గురించి వివరించగా, అందుకు మండల అధ్యక్షులు బాబుల్ రెడ్డి సానుకూలంగా స్పందించి, వెంటనే రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి ఎంపీని కలిసి వారి నిధుల నుండి తొమ్మిది లక్షల రూపాయలు సీసీ రోడ్డు భవన ఋషి గుడి దగ్గర నేడు మండల అధ్యక్షులు ముద్దాబాబుల్ రెడ్డిచే ప్రారంభించడం జరిగినదన్నారు.
ఈ కార్యక్రమంలో….. భోగా పార్థసారథి, మడగలం శ్రీను, మామిళ్ల సురేష్,సుదర్శన్ రెడ్డి, బికె. మణి, సామ రాంబాబు, వీసం సిద్ధారెడ్డి, నాగిరెడ్డి హరినాధ రెడ్డి, సింగరయ్య, మాజీ సర్పంచ్ భవాని, రోశయ్య, రిటైర్డ్ టీచర్ శంకరయ్య, మరియు భవన ఋషి గుడి కమిటీ సభ్యులు, నూకల చంగయ్య, బండారు సురేష్, మలవతు జయరాం, శివరాం, నడిమింటి వెంకటేష్, చంటయ్య, మామిళ్ల వెంకటసుబ్బయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button