Andhra Pradesh

అడవిలో గుర్తు తెలియని శవం….. రూరల్ సీఐ

తిరుపతి జిల్లా : రైల్వే కోడూరు నియోజకవర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ( సీఐ )డి. శ్రీనివాసులు మాట్లాడుతు….. చిట్వేల్ మండలం, నగరిపాడు పంచాయతీ, ఎగువపల్లె గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైందని, మృతుడి వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చునని,మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, పురుగులు పట్టిన స్థితిలో ఉండగా, మృతుడి ముఖం గుర్తుపట్టలేని విధంగా మారిపోయిందని, మృతదేహాన్ని అడవిలోనే ప్రభుత్వ డాక్టర్ లచే పోస్టుమార్టం చేపించి, శవాన్ని అడివిలోనే బుడిచిపెట్టెమన్నారు.
మృతదేహంపై లేత సిమెంట్ రంగు ప్యాంటు మాత్రమే ఉన్నదని, ప్రాథమిక విచారణలో మృతుడు సుమారు 3 నుండి 4 రోజుల క్రితం మరణించి ఉండవచ్చని భావిస్తున్నమన్నారు.
ప్రస్తుతం మరణానికి గల కారణాలు తెలియరాలేదని,
ఈ ఘటనపై స్థానిక నగరిపాడు వీఆర్ఓ, ఉదయ్ ఫిర్యాదు మేరకు చిట్వేల్ పోలీసులు 194 బన్స్ (బి యన్ యన్ యస్) సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించమన్నారు.
మృతుడి గుర్తింపు మరియు మరణానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని,
స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేయునది ఏమనగా, ఇటీవల రోజులలో 30–35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ఎవరైనా కనిపించకుండా పోయి ఉంటే లేదా ఈ మృతదేహానికి సంబంధించిన సమాచారం తెలిసి ఉంటే వెంటనే చిట్వేల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగలరని నేను ప్రజలకు తెలియ జెస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో…. యస్ ఐ, యస్. వినోద్ కుమార్ మరియు పోలీసులు, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button