ఆపదలో ఉన్న పేదలకు అండగా, సీఎం రిలీప్ పండ్….. సాయి లోకేష్

కడప జిల్లా : రాజంపేట నియోజకవర్గం, రాజంపేట పట్టణం భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో నేడు గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ చెక్కు లను భాధితులకు,బీజేపీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ చేతుల మీదుగా అందజేశారు.
రాజంపేట లోని మన్నురు నివాసి నారదాసు అశ్వినికి 25574/- రూపాయలు మరియు పేనగలురు మండలం వెలగచేర్ల గ్రామం చెందిన అబ్బిగారి వెంకట సుబ్బమ్మ కి 40644/- రూపాయలు మరియు ఒబులవరిపల్లి మండలం సుబ్బరాజు కి 98893/- రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన మొత్తాన్ని అందించారు.
బీజేపీ పార్టీ నాయకులు సాయి లోకేష్ మాట్లాడుతు…. ప్రజలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించడం మరియు పేద కుటుంబాలు అప్పుల భారంలో కూరుకుపోకుండా ఆర్థిక భరోసా కలిగిస్తూ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతూ సామాజిక భద్రతకు అండగా నిలుస్తున్న పథకమన్నారు.
ముఖ్య మంత్రి సహాయ నిధి కింద వారికి సహాయం అందించిన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజెస్తున్నమన్నారు.
ఈ కార్యక్రమంలో…. బిజెపి నాయకులు కృష్ణ యాదవ్, నరేంద్ర రాజు, తోట రామయ్య, శ్రీనివాసులు, మణి, రమణ, సుందర్, నవీన్, లక్ష్మి నారాయణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



