Andhra Pradesh

ప్రభుత్వ బహిరంగ సభ సందర్భంగా ట్రాఫిక్, మళ్లింపులు….. జిల్లా ఏస్పీ

తిరుపతి జిల్లా : తిరుపతి సూపర్ డెంట్ అఫ్ పోలీస్ (ఏస్పీ) యల్. సుబ్బారాయుడు ఐపీస్, నేడు గురువారం మీడియతో మాట్లాడుతు…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొనేదల పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రివర్యులు మరియు ఇతర ప్రముఖులు 12 తేది శుక్రవారం తిరుపతి నగరంలో నిర్వహించబడనున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్బంగా ప్రజల భద్రత, సౌకర్యం మరియు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడనున్నవన్నారు.
అలాగే ప్రజలు, ప్రయాణికులు మరియు వాహనదారులు క్రింది ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి పోలీసు శాఖకు సహకరించవలన్నారు.
“చిత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలు.
ఒమేగా హాస్పిటల్ – చెర్లోపల్లి – జూపార్క్ – గరుడ సర్కిల్ – నంది సర్కిల్ – లీలామహల్ – కరకంబాడి మార్గం ద్వారా ప్రయాణించలని అలాగే
“మదనపల్లి వైపు నుండి వచ్చే వాహనాలు.
పీలేరు – రంగంపేట – శ్రీనివాస మంగాపురం – చెర్లోపల్లి – జూపార్క్ – గరుడ సర్కిల్ – నంది సర్కిల్ – ఫ్లైఓవర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవలని, అలాగే ఆర్టీసీ బస్టాండ్ నుండి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు.
ఫ్లైఓవర్ – నంది సర్కిల్ – గరుడ సర్కిల్ – జూపార్క్ – చెర్లోపల్లి – ఒమేగా హాస్పిటల్ మార్గం ద్వారా ప్రయాణించవలెనని, అలాగే కడప వైపు నుండి వచ్చే వాహనాలు.
కట్టపుట్టాలమ్మ దేవాలయం – కరకంబాడి – మంగళం – లీలామహల్ మార్గం ద్వారా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవలని,
నెల్లూరు, నాయుడుపేట వైపు నుండి వచ్చే వాహనాలు.
వాజ్‌పేయి జంక్షన్ – ఓల్డ్ రేణిగుంట చెక్‌పోస్ట్ – రమణ విలాస్ సర్కిల్ – కట్టపుట్టాలమ్మ దేవాలయం – కరకంబాడి – మంగళం – లీలామహల్ – ఆర్టీసీ బస్టాండ్ మార్గం ద్వారా ప్రయాణించవలెనని,
“చెన్నై, పుత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలు.
గాజులమండ్యం సర్కిల్ – ఓల్డ్ రేణిగుంట చెక్‌పోస్ట్ – నారాయణాద్రి హాస్పిటల్ – బ్లిస్ సర్కిల్ మార్గం ద్వారా తిరుపతి నగరంలోకి ప్రవేశించవలనని, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నమన్నారు.
వాహనదారులు ముందస్తుగా తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకొని సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అలాగే
ట్రాఫిక్ నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
ప్రజల సౌకర్యార్థం అమలు చేస్తున్న ఈ ట్రాఫిక్ మళ్లింపులకు సహకరించి కార్యక్రమం విజయవంతానికి తోడ్పడాలన్నారు.
“ముఖ్య గమనిక….. అత్యవసర సేవలు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు మరియు ఇతర అత్యవసర సేవల వాహనాలకు పై ట్రాఫిక్ మళ్లింపులు వర్తించవన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button