ముఠా నుండి పదకొండు మంది భాధితులను విముక్తి చేసిన…. పోలీస్ అధికారులు

కడప జిల్లా: నందలూరు మండలం పోలీస్ స్టేషన్ లో నేడు గురువారం రాజంపేట ఏ ఏస్పీ మనోజ్ రాంనాధ్ హెగ్డే మీడియా సమావేశం లో మాట్లాడుతు….. జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ ( ఏస్పీ ) సెల్కె నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు కొంతమంది చేపల ముఠ బ్రోకర్లు (వేటగాళ్లు) నందలూరు మండలం, సోమశిల వెనుక జలలను కేంద్రంగా ఏర్పాటు చేసుకొని, అక్రమంగా చేపలను పట్టి పక్క జిల్లాలకు మరియు రాష్టాలకు రవాణా చేస్తు వచ్చారు. చేపలను పట్టేదానికి మనుషుల కోసం రైల్వే స్టేషన్ ల దగ్గర ఉండే కొందరు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉన్న యాచకులను, దిక్కులేని వారిని తీసుకువచ్చి ఒక్కో యాచాకుడికి 2000 నుండి 5000 రూపాయలు కూలి ఇస్తామని ఆశ పెట్టి, సోమశిల నదిలోకి యాచాకులను తీసుకోని వెళ్ళి వాళ్ళ దగ్గర అక్రమంగా చేపలను పట్టించిన అనంతరం యాచాకులకు తిండి తీర్థం పెట్టకుండా మరియు చెప్పిన కూలి ఇవ్వకుండా లకే అక్రమ అమ్మకాలు అమ్ముతువచ్చారు.
అనంతరం యాచాకులు నందలూరు సబ్ ఇన్స్పెక్టర్ వి. మల్లిఖార్జున రెడ్డి కీ పిర్యాదు ఇవ్వడం తొ వెంటనే నందలూరు యస్ ఐ, మల్లిఖార్జున రెడ్డి స్పందించి జిల్లా ఏస్పీ కీ మరియు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)పి. వెంకటేశ్వర్లు కు విషయం తెలపడంతో కడప,ఒంటిమిట్ట,నందలూరు పోలీస్ బృందలు రంగంలోకి దిగి మానవ రవాణా ముఠా పై దాడులు చేసి ఏడు మంది బ్రోకర్ ముఠా ను అరెస్ట్ చేసి, ముఠా దగ్గర ఉన్న పదకొండు మంది భాధితులను విముక్తి చేసేరు.
ముఠా నుండి విముక్తి అయినా పదకొండు మంది వ్యక్తులు పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో…. ఒంటిమిట్ట యస్ ఐ. శ్రీనివాసులు, పోలీస్ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.



